అమెరికాలోని ఒహియోలో కొలంబస్ సబర్బన్‌లో గల మౌంట్ కార్మెల్ సెయింట్ అన్నాస్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించగా అతడు వారించడమే కాకుండా పోలీసులపైకి కాల్పులు జరపడంతో పోలీసులు అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు హాస్పిటల్ కాల్పుల శబ్దాలతో హోరెత్తగా ఈ ఘటనలో 27 ఏళ్ల మిల్స్ జాక్సన్ అక్కడికక్కడే చనిపోయారు. నిందితుడు నల్లజాతీయుడు కావడంతో పోలీసులపై విమర్శలు వస్తుండడంతో ఒక పోలీస్ అధికారి బాడీ కెమేరాలో రికార్డైన వీడియోను పోలీసులు విడుదల చేశారు.

బాడీ కెమేరాలో రికార్డైన వీడియో