ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలోనే జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) మెరుపువేగంలాంటి బంతులతో
ఢిల్లీని దెబ్బ తీసాడు. అతడి ధాటికి ఓపెనర్లు పృథ్వీషా(2), శిఖర్‌ ధావన్‌(9)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానె(8) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ రిషబ్ పంత్‌(51; 32 బంతుల్లో 9×4) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు. చివరిలో లలిత్‌ యాదవ్‌(20), టామ్‌కరన్‌(21), క్రిస్‌వోక్స్‌(15), రబాడ(9) పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్‌ గెలవాలంటే 148 పరుగులు చేయాలి.