ఐపీఎల్‌ 2021లో ఏడవ మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరగబోతుంది. రెండు జట్లూ ఈ ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గి, రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై ఓడి రెండవ మ్యాచ్‌లో గెలవాలని రెడీ అయ్యింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డిండ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ చేయనుంది.

జట్టులోని ఆటగాళ్ల వివరాలు:

ఢిల్లీ క్యాపిటల్స్(Playing XI): పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), అజింక్య రహానే, మార్కస్‌ స్టోయినిస్‌, క్రిస్‌ వోక్స్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, లలిత్‌ యాదవ్‌, కాగిసో రబాడా, టామ్‌ కరన్‌, అవేశ్‌ ఖాన్‌

రాజస్థాన్ రాయల్స్(Playing XI): మనన్‌ వోహ్రా, సంజు శాంసన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, జోస్‌ బట్లర్‌, శివమ్‌ దుబే, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, క్రిస్‌ మోరిస్‌, చేతన్‌ సకారియా, జయదేవ్‌ ఉనాద్కట్‌, ముస్తాఫిజుర్ రెహమాన్