క్రైమ్ (Crime) వార్తలు (News)

పాతకక్షలకు ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు బలి

పెందుర్తి మండలం జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య కొన్నిరోజులుగా తగాదాలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో నిన్న రాత్రి మాటు వేసి బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన హంతకుడు బత్తిన అప్పలరాజు ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురిని ఎడపెడా కత్తితో నరుకుతూ అందిన వారిని అందినట్లు నరికేశాడు.

ఈ క్రమంలో చిన్నారుల్ని కూడా వదిలిపెట్టలేదు. పదునైన కత్తి కావడం, హంతకుడు ఆవేశంలో ఉండటంతో కాళ్లూ, చేతులూ ఎక్కడ పడితే అక్కడ గాయాలతో ఆరుగురు చనిపోయారు. మృతులను బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(37), ఉషారాణి పిల్లలు బమ్మిడి ఉదయ్‌(2), బమ్మిడి ఉర్విష(6 నెలలు)గా గుర్తించారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఆ ఆరు హత్యలతో జుత్తాడలో పరిస్ధితి భయానకంగా తయారావడంతో పోలిసులు రంగ ప్రవేశం చేసి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.