వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

సన్ రైజర్స్ ఓటమి! పాయింట్ల పట్టిక లో బెంగళూరు అగ్రస్థానం!!

బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై సన్ రైజర్స్ జట్టు రెండో ఓటమి మూటకట్టుకుంది. ఒక దశలో 66 బంతుల్లో 80 పరుగులు కావాల్సి ఉండటం తో సన్ రైజర్స్ గెలుపు దాదాపు ఖాయం గా కనిపించింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోతూ సునాయాస లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. షాబాజ్ అహ్మద్ వేసిన 17 వ ఓవర్లో బైర్స్తౌ, పండేయ్, సమద్ అవుట్ కావడం హైదరాబాద్ జట్టు కి పెద్ద దెబ్బ. 9 బంతుల్లో 17 పరుగులతో రషీద్ ఖాన్ పోరాడినా అప్పటికే మ్యాచ్ బెంగళూరు జట్టు గెలుపు ఖాయమైపోయింది. మాక్స్వెల్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టిక లో బెంగళూరు అగ్రస్థానం కి దూసుకెళ్లింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.