జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఐటీ ఉద్యోగార్థులకు టిసిఎస్ శుభవార్త ..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఉద్యోగుల నియామకాలపై అంచనాలను సంస్థ ప్రకటించలేదు కానీ ఈ ఏడాది కూడా 40,000 మందిని కొత్తగా తీసుకుంటామని యాజమాన్యం ఇటీవల వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీలో 4,88,649 మంది ఉద్యోగులు పని చేస్తుండగా గత 12 నెలల్లో కంపెనీ కొత్తగా 40,185 మందిని నియమించుకుంది. అందులోనూ 2021 జనవరి-మార్చి త్రైమాసికంలోనే 19,388 మంది ఉద్యోగుల్ని తీసుకుంది. ఒక కంపెనీ నుంచి వలసలు కూడా జీవనకాల కనిష్ఠ స్థాయి అయిన 7.2 శాతానికి చేరాయి.

పెరుగుతున్న ప్రాజెక్ట్లకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫ్రెషర్లను తీసుకోనుండటంతో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు మించే వీలుంది. అంతర్జాతీయంగా చూస్తే అసెంచర్‌కు 5.37 లక్షల మంది ఉద్యోగులు ఉన్నందున, 5 లక్షల మందితో టీసీఎస్‌ రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో భారతీయ రైల్వేలో 10 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. ఈ రకంగా టీసీఎస్‌ రెండో స్థానంలో ఉంది. టీసీఎస్‌లో ఉద్యోగుల పరంగా హైదరాబాద్‌ విభాగం 4వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 54,000 మించడంతో, ప్రస్తుతం 3వ స్థానానికి చేరినట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.