వార్తలు (News)

త్వరలో ఢిల్లీ బాటలోనే తెలంగాణ..

ఢిల్లీలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పా మూసివేయాలని..థియేటర్స్‌లో సీటింగ్‌ను 30శాతానికి కుదించాలని, రెస్టారంట్లలో కేవలం హోం డెలివరీకి మాత్రమే అనుమతి ఇవ్వాలని అన్నారు. ఇక వివాహాలకు కర్ఫ్యూ పాస్‌లు జారీ చేస్తారు.

ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలనీ, మాస్క్‌లు లేకుండా కన్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో ఎలాంటి పడకల కొరత లేదనీ, ఐదు వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ‘‘ప్రజల ఆరోగ్యం దృష్ట్యానే ఈ ఆంక్షలు విధించాల్సి వస్తోంది. వీటి వల్ల మీరు ఇబ్బంది పడతారని తెలుసు.. కానీ, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆంక్షలు అత్యవసరం’’ మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దనీ అన్నారు. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి కర్ఫ్యూ దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.