చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఈ ఉదయం నడుమూరు సమీపంలోని కుప్పం- కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన స్థానికులు అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఓ బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాగును తెరిచి చూడగా మృతదేహం సగ భాగం లభ్యమైంది. నడుము భాగం నుంచి దిగువ కాళ్ల వరకు మాత్రమే బ్యాగులో కుక్కి పడేశారు. మిగతా సగభాగం కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మృతదేహాన్ని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.