రాజకీయం (Politics) వార్తలు (News)

ట్యాక్స్ దెబ్బకి ఆంధ్ర నుండి పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి: లోకేశ్‌!!

ఎన్టీఆర్‌ భవన్‌లో నిరుద్యోగ యువతతో సమావేశమైన లోకేశ్‌ భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని చెప్పిన సీఎం జగన్‌ ఇప్పుడు అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే దుస్థితి తీసుకొచ్చారని ఆరోపణలు చేసారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట సీఎం జగన్‌ జాదూ క్యాలెండర్ విడుదల చేశారని ఎద్దేవా చేస్తూ 2.30 లక్షల ఉద్యోగాలకు బదులు కేవలం 10వేల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి పండగ చేస్కోమంటున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ రాష్ట్ర ప్రభుత్వం యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.

నిరుద్యోగులు నిరుత్సాహ పడవద్దని, అందరం కలిసి పోరాడుదాంఅని పాదయాత్రలో సీఎం జగన్‌ వాగ్దానం చేసినట్లుగా 2.30 లక్షల ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది 6,500 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. నెల రోజుల్లోగా కొత్త జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’’ అని లోకేశ్‌ తెలిపారు.

జగన్‌ ట్యాక్స్ దెబ్బకి రెండేళ్ల పాలనలో ఒక్క ప్రైవేట్ కంపెనీ ఆంధ్రపదేశ్ వైపు చూడలేదని, పైగా ఉన్న పరిశ్రమలన్నీ బాయ్‌బాయ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లూలూ, అదానీ ఇలా అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేసైనా రాష్ట్రంలో అన్ని ఖాళీల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేలా ఉద్యమిస్తామని లోకేశ్‌ మాట ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •