వార్తలు (News)

నెల్లూరు బొమ్మల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం!!

నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురం బొమ్మల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటలు ఎగసిపడుతుండడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.60 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. షార్ట సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. విచారణ ఇంకా పూర్తి కావలసి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •