క్రైమ్ (Crime) వార్తలు (News)

కేవలం రూ.20 వేలకి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పిస్తామని మోసం!!

బోరబండలోని సైట్‌-3కి చెందిన అల్లాకి బందే ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ఆయేషా తబస్సుం, మహిళా సంత సొసైటీ ప్రతినిధి కె.సుప్రియ. తాము డబుల్‌ బెడ్‌రూం ఇళ్లిప్పిస్తామంటూ స్థానికంగా ఉండే మహిళలను నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.20 వేలు మొదలుకుని, రూ.లక్షన్నర వరకు కూడా వసూలు చేశారు. ఇటీవల పెద్ద సంఖ్యలో బాధితులు ఆయేషా తబస్సుం, సుప్రియను కలిసి ఇళ్ల కోసం ఒత్తిడి తీసుకురావడంతో కనిపించకుండా పోయారు. నలుగురు బాధితులు సనత్‌నగర్‌ ఠాణాలో ఫిర్యాదుచేయగా సుప్రియను బుధవారం అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి ఆయేషా తబస్సుంను ఇటువంటి కేసులోనే జగద్గిరిగుట్ట పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. సుమారు 950 మంది వీరి చేతిలో మోసపోయి అనుమానిస్తున్నారు. ఆయేషానూ త్వరలో తమ కస్టడీలోకి తీసుకుంటాని ఎస్సై నర్సింహగౌడ్‌ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •