క్రైమ్ (Crime) వార్తలు (News)

రుయా ఘటన జరగడానికి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..??

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కోవిడ్‌ బాధితులు మరణించిన ఘటనపై చిత్తూరు కలెక్టర్‌ మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించగా అందులో ఆక్సిజన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రుయాలో కోవిడ్ బాధితులు మరణించారని వెల్లడించారు. కాంట్రాక్టర్‌ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని, ఆక్సిజన్‌ పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం పనిచేయలేదని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామి వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •