వార్తలు (News)

వ్యాక్సినేషన్ సెంటర్‌లో లెక్కకు మించి జనం.. లాఠీ ఛార్జ్!!

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు అంబేద్కర్ భవన్‌కు లెక్కుకుమించి జనం రావడంతో ఒకరినొకరు తోసుకుంటూ వ్యాక్సిన్ కోసం ఎగబడ్డారు. అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అన్నమాట లేకుండా ఒకరిమీద ఒకరు వచ్చి పడడంతో దీనిని చూసిన ఆరోగ్య కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గుంపును చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జీ చేయగా ఆగ్రహానికి గురైన కొందరు యువకులు అక్కడి కుర్చీలను విసిరికొట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు కొద్ది రోజులుగా ఈ సెంటర్‌కు చాలామంది వస్తున్నారని, అయితే వ్యాక్సిన్ కొరత కారణంగా అందరికీ అందడం లేదని స్థానికులు ఒకరు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •