వార్తలు (News)

వాహనాల వేలానికి భారీ స్పందన!!

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సీజ్‌ చేసిన వాహనాల వేలం చేపట్టగా దానికి భారీ స్పందన లభించి పెద్ద సంఖ్యలో ప్రజలు వాహనాలను సొంతం చేసుకున్నారు. ఊహించిన ధర కంటే 2.64 రెట్ల అధిక ధరకే వాహనాల విక్రయం జరిగింది. గోషామహల్‌ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేలం పాటలో దాదాపు 700 మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో 2,404 ద్విచక్రవాహనాలు, 59 ఆటోలు, 12 కార్లు కలిపి మొత్తం 2,548 వాహనాలను విక్రయించారు.

వీటిలో 73 వాహనాలు పనికి వచ్చే స్థితిలో ఉండగా, మిగిలిన వాహనాలను స్క్రాప్ లో వేలం వేశారు. మంగళవారం స్క్రాప్ వాహనాలు, బుధవారం పనికి వచ్చే వాహనాలను వేలం వేశారు. వాహనాల రిజర్వ్‌ ధర రూ.54,53,500 ఉండగా వేలంపాటలో రికార్డు స్థాయిలో 2.64 రెట్లు పెరిగి రూ.1,44,26,500 ఆదాయం లభించింది. వేలంలో పెట్టిన ప్రతి వాహనం అమ్ముడుపోవడంతో వేలం పాటను విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందికి సీపీ అంజనీకుమార్‌ అభినందనలు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    38
    Shares
  • 38
  •  
  •  
  •  
  •