క్రైమ్ (Crime) వార్తలు (News)

నాసిక్ ప్రెస్‌లో హై సెక్యూరిటీ మధ్య కొత్త రూ.500 నోట్లు మాయం??

మహారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎన్‌పి) లో కరెన్సీ నోట్ ప్రెస్ 24 గంటలపాటు హై సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అలాంటి నోట్ల ముద్రణ కేంద్రం నుంచి రూ. 5లక్షల నగదు మాయమైంది. సీఎన్‌పీ నుంచి గత ఐదు నెలల్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లను దొంగిలించినట్లు ఉప్నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనిల్ షిండే మంగళవారం వెల్లడించారు. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌లో అత్యధికంగా నోట్లు ముద్రవుతుంటాయి. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరి 12 నుంచి జూలై 12 మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లను దొంగిలించినట్లు, ఈ మేరకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రూ.500 నోట్లు మొత్తం 1000 అపహరణకు గురైనట్లు వెల్లడించారు. అయితే హై సెక్యురిటీ ఉండే కరెన్సీ నోట్ ప్రెస్‌లోకి ఇతరులు ప్రవేశించే అవకాశం లేదు కాబట్టి లోపల పనిచేసే సిబ్బందే ఎవరో ఒకరు దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •