ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కరోనా నుండి కోలుకున్నవారు స్పుత్నిక్‌ తీసుకుంటే ఒక్క డోసు చాలు!!

కరోనా నుండి ఇప్పటికే కోలుకున్న వారు స్పుత్నిక్‌-వి టీకాను ఒక్క డోసు తీసుకుంటే సరిపోతుందని, రెండో డోసు వేసుకున్నప్పటికీ వారిలో యాంటీబాడీల స్థాయులేమీ పెరగడం లేదని తాజా అధ్యయనం అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత తలెత్తుతుండటంతో తమ దేశంలో 289 మంది ఆరోగ్యరంగ కార్యకర్తలను బృందాలుగా విభజించి టీకా సమర్థతను పరిశీలించగా రెండో డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత ప్రతిఒక్కరిలోనూ (అంతకుముందు వైరస్‌ బారిన పడనివారు) యాంటీబాడీలను వారు గుర్తించారు. రెండో డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత ప్రతిఒక్కరిలోనూ (అంతకుముందు వైరస్‌ బారిన పడనివారు) యాంటీబాడీలను వారు గుర్తించారు. ఆ బృందంలోని 94% మందిలో తొలి డోసుతోనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు నిర్ధారించారు.

అంతకుముందే ఒకసారి వైరస్‌ బారిన పడ్డవారిలో మాత్రం ఒక్క డోసు స్పుత్నిక్‌తోనే అధిక స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని, రెండు డోసులు తీసుకున్నవారితో పోలిస్తే.. వీరిలోనే (ఒకసారి ఇన్‌ఫెక్షన్‌ + ఒక డోసు) రోగ నిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారైందని వివరించారు. వీరిలో యాంటీబాడీల ఉత్పత్తి రెండో డోసుతో ఏమాత్రం పెరగలేదని స్పష్టం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •