జాతీయం (National) వార్తలు (News)

రికార్డుల ఝడిలో నేటి మార్కెట్లు!!

దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లో ముగిసి సెన్సెక్స్‌ 53వేల మైలురాయిని దాటగా.. నిఫ్టీ 15,900 మార్క్‌పైన స్థిరపడి ముదుపరులను ఆనందాల్లో ముంచాయి. నేటి ఉదయం 52,968 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 53,266 వద్ద కొత్త రికార్డును సృష్టించి ఆ తర్వాత కొన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణతో కాస్త తడబడినప్పటికీ చివరకు 254.80 పాయింట్ల లాభంతో 53,158.85 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 15,924.20 వద్ద కొత్త రికార్డు సృష్టించి మరీ ముగించింది.

నేడు దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలు అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో విప్రో, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడగా.. భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •