టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

APSWREIS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీ APSWREIS పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రిన్సిపాల్/TGT/కేర్ టేకర్(వార్డెన్) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ల ప్రక్రియ జులై 22న ప్రారంభం కానుండగా.. ఆగస్టు 16ను అప్లికేషన్లకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనుండగా ఇందులో ప్రిన్సిపాల్ గ్రేడ్ – 2 విభాగంలో 1 పోస్టు, TGT – 38, కేర్ టేకర్/వార్డెన్ విభాగంలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ప్రిన్సిపాల్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో పీజీ చేసి ఉండాలి. 50 శాతం మార్కులతో B.Ed చేసి ఉండాలి. TGT: పీజీ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు TET-2 పేపర్ పాసై ఉండాలి.

కేర్ టేకర్/వార్డెన్- ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు

వేతనాలు వివరాలు: ప్రిన్సిపాల్ గ్రేడ్ – 2 విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ.40,270-రూ.93,780 వరకు వేతనం చెల్లించనున్నారు. టీజీటీ: ఈ విభాగంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 28,940-రూ.78,910 వరకు చెల్లించనున్నారు

కేర్ టేకర్/వార్డెన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,200 నుంచి రూ. 63,010 వరకు చెల్లించనున్నారు.
నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్: https://welfarerecruitments.apcfss.in/

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •