టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నీట్ రాస్తే అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్స్??

నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) (NEET) పరీక్షా చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఇది అందించే అవకాశాలు అపరిమితం. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులు నీట్ రాస్తారు. అయితే నీట్ తర్వాత డాక్టర్ మాత్రమే కాదు ఇంకా ఇతర వృత్తులతో పాటు అకడమిక్ కోర్సుల్లో చేరొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం!

డాక్టర్:
వేలాది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు వైద్యరంగంలో అడుగుపెట్టి సేవలందిస్తూ తమ స్పెషాలిటీలో నైపుణ్యం సాధించాలి అనుకుంటారు. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అది అసాధ్యం. అటువంటి వారు నీట్ పరీక్ష రాసి ఎంచుకున్న స్పెషలైజేషన్ ఫీల్డ్‌లోనే ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా పొందొచ్చు. తరువాత ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టర్‌గా పని చేయవచ్చు.

ఎండీ/ఎంఎస్/డిప్లొమా
ఎంచుకున్న విభాగంలో నైపుణ్యం పొంది మంచి డాక్టర్ లేదా సర్జన్ కావాలనుకునే విద్యార్థులకు నీట్ పరీక్ష మంచి అవకాశాలను కల్పిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ద్వారా ఆయా విభాగాల్లో మంచి నైపుణ్యం పొందొచ్చు. ఇందుకు ఎండీ, ఎంఎస్, డొప్లొమా వంటి వాటిని అభ్యర్థులు ఎంచుకోవచ్చు.

క్లినికల్ రీసెర్చ్:
ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు వైద్య పాఠ్యపుస్తకాలకు మించి విషయాలు తెలుసుకోవడానికి చేసే పరిశోధనలను క్లినికల్ రీసెర్చ్ అంటారు. నీట్ ద్వారా ఇది సాధ్యపడుతుంది.

డెంటిస్ట్ (BDS)
డెంటిస్ట్ కావాలనుకునే విద్యార్థులు నీట్ ద్వారా ఎంబీబీఎస్‌తో పాటు బీడీఎస్ కోర్సులో డిగ్రీ సంపాదించవచ్చు. అనంతరం పబ్లిక్ క్లినిక్‌లలో పని చేయడంతో పాటు సొంత క్లినిక్‌లను ప్రారంభించి వైద్య సేవలు అందించవచ్చు.

లీగల్ మెడికల్ అడ్వైజర్:
చట్టపరమైన కేసుల విషయంలో కీలకమైన వైద్య సలహాలు ఇచ్చే అర్హత సాధించాలంటే లీగల్ మెడికల్ అడ్వైజర్ కెరీర్ ని ఎంపిక చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అనేక క్రైమ్ కేసులలో వైద్య నిపుణుల సలహాలు చాలా ముఖ్యం. దీంతో లీగల్ మెడికల్ అడ్వైజర్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు.

ఎంబీఏ
కొందరు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు హాస్పిటల్ & హెల్త్ మేనేజ్‌మెంట్/అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్‌లలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనుకుంటారు. ఇలాంటి వారు తమ పారిశ్రామిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఎంబీఏ చేస్తుంటారు. అయితే నీట్ ఎగ్జామ్ ద్వారా ఎంబీఏ చేయడం సాధ్యమవుతుంది.

ఎమ్మెస్సీ
ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు నీట్ ద్వారా ఏరోస్పేస్ మెడిసిన్, అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ తదితర సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ పొందొచ్చు. తద్వారా ఎన్నో ఉద్యోగావకాశాలు పొందొచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •