జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) రాజకీయం (Politics) వార్తలు (News)

భారత జాతీయ పతాకం.. ముఖ్యఅంశాలు??

75 స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దేశమంతా ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తోంది. బ్రిటిష్ వారి చేతిలో బందీలుగా ఉన్న మన దేశం బయటపడిన రోజుగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామనే సంగతి చిన్నపిల్లవాడిని అడిగిన చెప్తాడు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్ర కోట పై ప్రధాన మంత్రి తివర్ణ పతాకాన్ని ఎగరేసి ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సైనిక దళాల విన్యాసాలు ఆకట్టుకుంటాయి. మువ్వన్నెల జెండా అంటే స్వేచ్ఛకు చిహ్నం అని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు. కానీ మనం ఆగస్టు 15న ఎగురవేసే ఈ త్రివర్ణ పతాకం గురించి మనకి ఎంతవరకు తెలుసు?? మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందామా?

భారత జాతీయ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. భారతీయ పతాకాన్ని 1947 జులై 22న గుర్తించి దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15న దీన్ని ఎగరేశారు. మొదటిసారి జాతీయ జెండాను 1906 ఆగస్టు 7న ఎగరేశారు. కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ లో దీన్ని ఎగరేశారు. అయితే అందులో కేవలం మూడు అడ్డు గీతలు (ఆకుపచ్చ, పసుపు, ఎరుపు) మాత్రమే ఉండేవి. చట్ట ప్రకారం భారత జాతీయ పతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. కానీ కాటన్, సిల్క్ రెండూ కలిపిన ఈ వస్త్రాన్ని గాంధీజీ పాపులర్ చేశారు. కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం (KKGSS) మాత్రమే జెండాకి సంబంధించిన క్లాత్ తయారుచేస్తుంది. ఈ సంస్థ మాత్రమే భారతీయ పతాకం తయారుచేయడానికి లైసెన్స్ పొందిన సంస్థ.
మరెక్కడా తయారు చేయడానికి వీలు లేదు. మన జెండాలోని కాషాయం రంగు శక్తి, పరాక్రమానికి చిహ్నం. తెలుపు స్వచ్ఛతకు, శాంతికి, సత్యానికి చిహ్నం. ఇక ఆకు పచ్చ రంగు ప్రజల శ్రేయస్సుకు చిహ్నం. అశోక చక్రం ధర్మానికి చిహ్నం. జెండా మధ్యలో ఉన్న అశోక చక్రం నేవీ బ్లూ రంగులో ఉంటుంది. అందులో 24 చువ్వలు ఉంటాయి. భీకాజీ రుస్తుం కామా విదేశాల్లో భారతీయ పతాకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తి. టెన్సింగ్ నార్గే అనే వ్యక్తి ఎవరెస్ట్ పైన భారతీయ పతాకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తి. 1953 మే29న మన జాతీయ జెండాను నార్గే ఎవరెస్ట్‌పై ఎగరేశారు. 2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు. కానీ 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్‌ను మార్చింది. మిగిలిన రోజుల్లోనూ జెండా ఎగరేయవచ్చని పేర్కొంది. ఫ్లాగ్ కోడ్ ప్రకారం జెండాను పగటి పూట మాత్రమే ఎగరేయాలి. జాతీయ జెండా పైన ఎలాంటి ఇతర జెండాలు ఉండకూడదు. జెండాను తిరగేసి ఎగరేయడం, కింద పడుకోబెట్టడం వంటివి చేయకూడదు. ఒకవేళ విదేశాల నుంచి ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ కారులో ప్రయాణం చేస్తే భారత జెండా కుడి వైపు, ఆ దేశపు జాతీయ జెండా ఎడమ వైపు ఉంచాలి.

ఏ దేశానికి అయినా జాతీయ జండా పవిత్రమైనది. దాని గురించి తెలుసుకోవడం దేశ పౌరుల కనీస బాధ్యత!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •