టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

దిశా యాప్ చూపిస్తే చాలు.. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం!

దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా విజయనగరం జిల్లా పోలీసు యంత్రాంగం ఆయత్తమవుతుంది. విజయనగరంలో మహిళలు తమ మొబైల్ ఫోన్‌లలో దిశా యాప్‌ను చూపిస్తే చాలు పట్టణంలోని ముఖ్య కూడళ్ళ నుంచి ఇతర ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు, పోలీస్‌ శాఖ రెండు బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు.

ప్రతి మహిళా తనను తాను రక్షించుకునేందుకు ఇదో ఆయుధంలా ఉపయోగపడుతుందని, ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉండాలని, ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కె.శ్రావణి, పోలీసు అధికారులతో పాటు మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •