జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఎల్‌ఐసీ.. గరిష్ఠ స్థాయిలో డెత్ క్లైమ్స్!!

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత జీవిత బీమా సంస్థ (LIC)కి డెత్ క్లైమ్స్ చాల ఎక్కువగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21 సంవత్సరంలో డెత్ క్లైమ్స్ ఏకంగా 17 శాతం పెరిగినట్టు అంచనా! ఈ సంఖ్య గత ఐదేళ్ల కాలంలోనే గరిష్ఠ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీకి 9.75 లక్షల డెత్ క్లైమ్స్ రాగా..2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.47 లక్షల డెత్ క్లైమ్స్ వచ్చాయని, మునుపటి సంవత్సరపు క్లైమ్స్‌ను కూడా కలుపుకుని మొత్తం 11.42 డెత్ క్లైమ్స్‌ను సెటిల్ చేసినట్లు వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,195.01 కోట్ల డెత్ క్లైమ్స్ పాలసీదారుల నామినీలకు చెల్లించినట్లు వివరించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో డెత్ క్లైమ్స్ కింద ఎల్ఐసీ రూ.17.419.57 కోట్లు చెల్లించింది. కాగా ఆ సంవత్సరంలో 9.32 లక్షల క్లైమ్స్‌ను ఎల్ఐసీ సెటిల్ చేసింది. 2020 జూన్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో సెకండ్ వేవ్ కారణంగా దేశంలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించడంతో డెత్ క్లైమ్స్ అత్యధికంగా వచ్చాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •