జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఎస్బీఐలో 68 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్?

దేశీయ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు 68 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రొడక్ట్ మేనేజర్, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్, డిప్యూటీ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఎస్ బిఐ పూనుకుంది. అయితే దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లో చేసుకోవాలి.

https://sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగానికి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం 68 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ మేనేజర్- ఇంజనీర్(సివిల్) ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 36 ఉండగా అసిస్టెంట్ మేనేజర్- ఇంజనీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 10, అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్) ఉద్యోగ ఖాళీలు 4, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 10, రిలేషన్‌షిప్‌ మేనేజర్ 6, ప్రొడక్ట్ మేనేజర్ 1, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.

60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్)/ పీజీడీఎం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 2వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి సెప్టెంబర్‌ 13వ తేదీ స్టార్టింగ్ డేట్ కాగా సెప్టెంబర్ 25వ తేదీ పరీక్ష తేదీగా ఉంది. https://sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •