అంతర్జాతీయం (International) వార్తలు (News)

జపాన్ లో 5 వ నంబర్ ప్రత్యేక ప్రమాద హెచ్చరిక!!

జపాన్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే హిరోషిమా సహా మరో 8 ప్రధాన నగరాలకు అత్యున్నత అత్యవసర హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. జపాన్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని స్తంభింపచేశాయి. అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి.

దేశంలోని నైరుతు ప్రాంతమైన సాగా, నాగసాకి, ఫుకుయోకా నగరాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది. దీంతో ఆ నగరాల్లో అత్యధికమైన 5న నంబర్ ప్రత్యేక ప్రమాద హెచ్చరికను జపాన్ ప్రభుత్వం జారీ చేసింది. అన్ని నదులు కూడా ప్రమాదకర స్థాయి దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా అధికారులకు సాధ్యం కావడం లేదు.

గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లెవల్ 5 ప్రమాద హెచ్చరిక అనేది అత్యంత ప్రమాదకర స్థాయి పరిస్థితుల్లోనే జారీ చేస్తారు. ప్రస్తుతం జపాన్ లో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది. అధికారులు సైతం బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. ప్రజలు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల పై కప్పులకు చేరుకున్నారు. తమ జీవితాలు కాపాడమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •