జాతీయం (National) వార్తలు (News)

వరుసగా 28 వ రోజు కూడా స్థిరంగా కొనసాగుతున్న చమురు ధరలు!!

వరుసగా 28 వ రోజు కూడా పెట్రోల్ ధరలలో మార్పులు కనిపించకపోవడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధర దిగివచ్చింది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. శనివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తోంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.92 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.99.49 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.02 ఉండగా, డీజిల్ ధర రూ. 98.63గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.37లకు ఉండగా, డీజిల్ ధర రూ.98.96గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.96 గా ఉండగా, డీజిల్ ధర రూ.99.56గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.21 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.78లకు లభిస్తోంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.98గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 98.10గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71గా ఉండగా లీటర్ డీజిల్ ధర ధర రూ.97.83గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.89గా ఉండగా డీజిల్ ధర రూ. 97.89గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51గా ఉండగా డీజిల్ ధర రూ.98.59గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా, డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా, డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.83 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.18గా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •