వార్తలు (News)

కృష్ణా నదికి పెరిగిన వరద.. నీటిలో 100కు పైగా లారీలు??

కృష్ణా జిల్లాలోని చెవిటికల్లులో నది ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో వందకు పైగా లారీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లారీ డ్రైవర్లతోపాటు కూలీలను పోలీసులు, అధికారులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చి కాపాడారు.

ఇసుక కోసం 200లకు పైగా లారీలు రాత్రి చెవిటికల్లు ర్యాంప్ కు చేరుకోగా లారీల్లో ఇసుక నింపేందుకు 300లకు పైగా కూలీలు వెళ్లారు. లారీల్లో ఇసుక నింపుతుండగా అర్ధరాత్రి ఒక్కసారిగా కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కూలీలు, లారీ డ్రైవర్లు అక్కడే చిక్కుకుపోయారు సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటినా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పడవల్లో వెళ్లి డ్రైవర్లు, కూలీలను కాపాడారు. 130 మంది కూలీలు, డ్రైవర్లను ఒడ్డుకు చేర్చారు. కంచికచెర్ల ఎమ్మార్వో రాజకుమారి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానదికి 50 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోందని చెప్పారు.

కూలీలు అందరిని రక్షించామని, లారీలను బయటకు తీసుకురావాలంటే ర్యాంప్ లో తిరిగి రోడ్డు నిర్మించాలన్నారు. రోడ్డు వేస్తే తప్ప లారీలు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •