అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అత్యంత ఎత్తులో పవర్‌ స్టేషన్‌ నెలకొల్పే దిశగా టాటా ??

ఇప్పటికే పలు రికార్డు లు సొంతం చేసుకున్న టాటా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేసి దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని ఏర్పాటు చేసి మరో రికార్డు సొంతం చేసుకోవాలనుకుంటుంది.

కాలుష్య రహిత గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తుండడంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్‌ పవర్‌ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది

ఇప్పటికే అనంతపురంలో 150 మెగావాట్ల పవర్‌ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్‌గోడ్‌లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్‌ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్‌లో కొత్తగా సోలార్‌ పవర్‌ ప్లాంటును నిర్మించి సరికొత్త రికార్డు ను నెలకొల్పడానికి పూనుకుంది. లదాఖ్‌ ప్రధాన పట్టణమైన లేహ్‌ సమీపంలో లైంగ్‌ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్‌ పవర్‌ స్టేషన్‌ను నిర్మించనుంది.

లేహ్‌ సమీపంలో నిర్మించే సోలార్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్‌ స్టేషన్‌కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని సైతం టాటా పవర్‌ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •