జాతీయం (National) వార్తలు (News)

భారీ కట్టుదిట్టాల నడుమ దేశ రాజధాని??

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వేలాది మంది భద్రతా సిబ్బంది పలు వ్యూహాత్మక ప్రాంతాలతో సహా దిల్లీ సరిహద్దుల్లో మోహరించారు. ఆదివారం ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న వేళ అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

విధ్వంస నిరోధక చర్యల్లో భాగంగా పోలీసులు యమునా నదిలో మోటార్‌ బోట్లతో పాటు నగరవ్యాప్తంగా ముమ్మరంగా పెట్రోలింగ్‌ కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా వైమానిక వస్తువులు, బెలూన్లు అనుమతించడంలేదని దిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. నగరంలో పలు వ్యూహాత్మక ప్రదేశాలు, ఎర్రకోట వద్ద సివిల్‌ డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని అదనపు నిఘాలో భాగంగా మోహరించారు. దిల్లీ సరిహద్దుల్లో వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. దేశ రాజధాని నగరంలోని ప్రధాన మార్గాలను రేపు ఉదయం 4గంటల నుంచి 10గంటల వరకు మూసివేస్తున్నట్టు వెల్లడించారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినల్స్‌తో పాటు నగరవ్యాప్తంగా భారీగా బారికేడ్లు పెట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    24
    Shares
  • 24
  •  
  •  
  •  
  •