క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

నా చావుకు సీఎం జగనే కారణం : మహేష్‌.. వార్డు వాలంటీర్!

అనంతపురం జిల్లా రాయదుర్గంలో నాలుగవ సచివాలయం 9వ వార్డు వాలంటీర్ గా పని చేస్తున్న మహేష్‌ రెండు రోజుల క్రితం తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే మహేష్‌ రాసిపెట్టిన సూసైడ్‌ నోట్‌లో ”నా చావుకు కారణం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం” అని పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని, తనలాంటి పరిస్థితి మరొక వాలంటీర్ కు రాకుండా చూడాలని సూసైడ్ నోట్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇప్పటికీ తమతో బండ చాకిరీ చేయిస్తున్నారనీ, అన్ని రకాలుగా వాడుకుంటున్నారనీ గ్రామ, వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్నవారు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు అధికారులు, మరోవైపు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా మానసిక ఇబ్బందులకు గురవుతున్నామని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు.

అధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కంటే అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు చాలా కష్టంగా మారాయని ఈ నేపథ్యంలోనే మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •