టాప్ స్టోరీస్ (Top Stories) రాజకీయం (Politics) వార్తలు (News)

ఏపీకి శాశ్వత బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం!!

తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత బదిలీపై వారు ఏపీ వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి ఉద్యోగులను బదిలీపై ఏపీ తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వానికి తెలియజేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే కొందరిని మాత్రం ఇందుకు మినహాయించింది. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు, విజిలెన్స్ కేసులు పెండింగులో ఉన్న వారికి మాత్రం అవకాశం లేదని తేల్చి చెప్తూ, సచివాలయంతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని సూచిస్తూ శాశ్వత బదిలీల కోసం అక్టోబరు 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఉద్యోగి పనిచేసిన శాఖాధిపతి బదిలీకి అభ్యంతరం లేదన్న పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ సర్కారు నుంచి అనుమతి లభించిన వెంటనే సంబంధిత శాఖాధిపతులు ఉద్యోగులను రిలీవ్ చేయగానే వారిని శాశ్వతంగా బదిలీ అయినట్టే పరిగణిస్తారు. వారు మళ్లీ వెనక్కి రావాలంటే మాత్రం కుదరదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బదిలీపై వెళ్లేవారికి ఎలాంటి ప్రయాణ, కరవు భత్యాలు లభించవని పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •