వార్తలు (News)

వరదల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గుజరాత్‌!!

గుజరాత్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌ జిల్లాల్లో వరదలు విలయతాండవం చేస్తుండగా సౌరాష్ట్రం ప్రాంతం మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఆర్మీ ,ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 14 వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించగా, ముగ్గురు చనిపోయారు.

రాజ్‌కోట్‌లో వందలాది ఇళ్లు నీట మునగడంతో ఇళ్లలో చిక్కుకున్న వాళ్లను ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు సహాయక సిబ్బంది. పోలీసు సిబ్బంది కూడా వరద నీటి లోనే విధులను నిర్వహిస్తున్నారు. తమ వాహనాలు మునిగిపోతునప్పటికి ప్రజలను రక్షించడానికి ముందుకెళ్తూ తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా గ్రామాలు నీట మునిగినప్పటికి ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ల సాయంతో జనాన్ని కాపాడుతున్నారు.

వరదల కారణంగా పంటనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా జరుగుతోంది. గుజరాత్‌లో వరదల పరిస్థితిపై ప్రధాని మోదీ కూడా ఆరా తీసి రాష్ట్రానికి అన్నివిధాలా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మరో రెండు రోజుల పాటు గుజరాత్‌లో భారీవర్షాలు కురిసే అవకాశమందని వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో చాలా డ్యాంలు నిండిపోగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •