క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

ఆరుగురు పాక్‌ ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీస్ లు!!

పాక్‌లోని ఐఎస్‌ఐలో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులు సహా మొత్తం ఆరుగురు.. పండుగలను లక్ష్యంగా చేసుకొని భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించగా ఈ కుట్రలను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పలు ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు దిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో గాలింపు చేపట్టగా రాజస్థాన్‌లోని కోటలో మహారాష్ట్రకు చెందిన ఓ ఉగ్రవాది పట్టుబడినట్టు దిల్లీ ప్రత్యేక పోలీస్‌ విభాగం సీనియర్‌ అధికారి నీరజ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. అలాగే, యూపీలోని యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సహాయంతో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. దిల్లీలో ఇద్దరిని పట్టుకున్నట్టు వివరించారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లోని ఓ ఫాంహౌస్‌లో 15 రోజుల పాటు ఉంచి ఆయుధాల వినియోగంపై శిక్షణ కూడా ఇచ్చారని పోలీసులు తెలిపారు.

యూపీలో అరెస్టు చేసిన ఉగ్రవాదుల నుంచి ఐఈడీ బాంబులతో పాటు పలు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లఖ్‌నవూ, రాయ్‌బరేలీ, ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌), ప్రతాప్‌గఢ్‌లలో ఏకకాలంలో సోదాలు జరిపినట్టు అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రకాశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక లైవ్‌ ఐఈడీని స్వాధీనం చేసుకొని, బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ దీన్ని నిర్వీర్యం చేసినట్టు వివరించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •