క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

నీట్ పరీక్షల్లో బయటపడిన స్కామ్??

నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను లక్షంగా చేసుకునిన ఓ ముఠా లక్షల రూపాయాలు సంపాధించాలని ప్లాన్ చేయగా కరోనా కూడా వారికి సహకరించింది. ఎలా అంటారా?? కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ఎన్-95 మాస్క్ ల్లో సీక్రేట్ మైకులు పెట్టిన నిందితులు నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జవాబులు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో పని చేస్తున్న అధికారులు ప్రశ్న పత్రాలను మొబైల్ లో ఫోటోలు తీసి వాట్సాప్ లో బయటకు పంపించగా బయట నుంచి ప్రశ్నలకు జవాబులు చెప్పడంతో కొందరు విద్యార్థులు పరీక్ష రాసేశారు.

ఎక్కడో తప్పు జరుగుతుందని ముందు నుండి అనుమానంతో ఆరా తీస్తున్న పోలీస్ లకు మాస్క్ సీక్రేట్ మైక్ ల వ్యవహారం తెలిసిపోయింది. రూ. 30 లక్షలకు పైగా డీల్ కుదుర్చుకున్న నిందితులు పరీక్షా కేంద్రం ఆవరణంలోనే రూ. 10 లక్షలు అడ్వాన్ కూడా ఇచ్చేశారు. మాస్క్ సీక్రేట్ మైకుల వ్యవహారం బయటకురావడంతో నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బదులుగా నకిలీ విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్దం అవుతున్నారని రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందడంతో నకిలీ విద్యార్థులను పట్టుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసారు. నీట్ పరీక్షలు రాయడానికి వస్తున్న విద్యార్థుల హాల్ టిక్కెట్లు పూర్తిగా పరీశీలించి వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు.

అయితే రాజస్థాన్ లోని సికార్ ప్రాంతంలో ఓ ముఠా సభ్యులు సాంకేతికతను, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి కోట్ల రూపాయలు సంపాధించాలని అలోచించి ఎన్-95 మాస్క్ ల్లో సీక్రేట్ మైకులు, వాటిలో న్యానో సిమ్ లు పెట్టిన నిందితులు నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జవాబులు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో పని చేస్తున్న అధికారులు ప్రశ్న పత్రాలను మొబైల్ లో ఫోటోలు తీసి వాట్సాప్ లో బయటకు పంపించారు. మాస్క్ లో సీక్రేట్ మైక్ లు ఉండటంతో విద్యార్థులు బటన్ నొక్కితే బయట నుంచి జవాబులు చెబుతున్నారు. విద్యార్థుల చెవుల్లోపల ఇయర్ ఫోన్స్ లాంటి చిన్నమైక్ లు అమర్చిన నిందితులు బయట నుంచి సులభంగా ప్రశ్నలకు జాబులు చెబుతున్నారు. విద్యార్థులు వేసుకున్న మాస్క్ లు క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసు అధికారులు అందులో సీక్రేట్ మైక్ లు ఉన్న విషయం గమనించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

నీట్ పరీక్షల స్కామ్ లో పాల్గొన్న దినేశ్వరి కుమారి (19)తో సహ జైపూర్ లో పనిచేస్తున్న పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్ రామ్ సింగ్, పరీక్షా కేంద్రం ఇన్ చార్జ్ ముఖేష్ తో పాటు మొత్తం 21 మందిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •