దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11,84,883 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,984 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజు వ్యవధిలో కరొనతో 247 మరణాలు సంభవించగా ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,76,135 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,168 మంది కోలుకున్నారు. దేశంలో క్రియాశీల కేసులు 87,562 కి చేరాయి.