ఇప్పటివరకు ఏపిలో కాన్సర్ ఆస్పత్రి లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటూ క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్టు ప్రకటించారు. అంతే కాదు ఆరోగ్య శ్రీ ద్వారా క్యాన్సర్ కు ఉచిత చికిత్స అందజేస్తామని తెలిపి క్యాన్సర్ బాధితులకు ఊరట కల్పించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లేకపోవడంతో బాధితులంతా వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం ఎన్నో ఆరోగ్య సేవలు అందిస్తున్న రాష్ట్ర సర్కార్ కరోనా చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చి అందరికి ఆదర్శమయ్యారు. ఇక ఇప్పుడు కాన్సర్ వంటి మహమ్మారి ని కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చి మరో అడుగు ముందుకు వేశారు.