భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృత్యువు చేతిలో ఓటమి పాలయ్యారు. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన.. ఈ ఉదయం బెంగళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని భారత వాయుసేన ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.