హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో మొత్తం 300 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ డివిజన్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పోస్టులుండగా ఇవి కాంట్రాక్ట్ పోస్టులు. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది మాత్రమే. ఈసీఐఎల్ అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి ఐదేళ్ల వరకు కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 21 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

భర్తీ చేసే పోస్టు పేరు- టెక్నికల్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు- 300
దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 21 సాయంత్రం 4 గంటలు వరకు సమయం ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్- తేదీలను త్వరలో ఈసీఐఎల్ ప్రకటించనుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. అభ్యర్థులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. అందులో కనీసం ఆరు నెలలు ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.
వయస్సు- 2021 నవంబర్ 30 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. జాయీత భత్యాల విషయానికి వస్తే మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నుంచి ఐదో ఏడాది వరకు నెలకు రూ.31,000. అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. బీఈ లేదా బీటెక్‌లో వచ్చిన మార్కులు, అనుభవం ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తుంది. మొదట ఒక ఏడాది వరకు కాంట్రాక్ట్ గడువు ఉంటుంది దానిని ఐదేళ్ల వరకు కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశం ఉంది.

ఎలా ధరకాస్తు చేయాలో చూడండి..
Step 1- అభ్యర్థులు ముందుగా https://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
Step 2- లేదా అభ్యర్థులు నేరుగా https://careers.ecil.co.in/advt3921.phpలింక్ ఓపెన్ చేయాలి.
Step 3- Apply for Technical Office on Contract Positions పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టు సెలెక్ట్ చేయాలి.
Step 5- అభ్యర్థి విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
Step 6- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
Step 7- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.