తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయదానికి ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు.

డిసెంబర్ 15 అంటే నేటి నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని, ఇందులో భాగంగానే నేటి నుండి ఈ నెల చివరి వరకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది. గత వానాకాలం సీజన్ లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రెండో రోజు రెండు ఎకరాలు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లో బదిలీ చేశారు. ఈ యాసంగి సీజన్ లోనూ అదే పద్ధతిని అమలు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.