పశ్చిమగోదావరి జిల్లా లోని జంగారెడ్డిగూడెం సమీపంలో అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతున్న తెలుగు వెలుగు బస్సు డివైడర్ ను ఢీ కొట్టి జిల్లేరు వాగులో బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉండడంతో వారిని దగ్గర్లోని జాలర్లు, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే ఊపిరి ఆడక ఏడుగురు మరణించారు.

గాయపడిన మిగతా వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సులో 47 మందికి పైగా ప్రయాణికులు ఉండడంతో ఓవర్ లోడ్‌ అయ్యి వెళుతుండడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.