దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు కూడా నష్టాల్లోనే ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,122.00 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడేలో 57,671.61 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 329.06 పాయింట్ల నష్టంతో 57,788.03 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,323.65 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,351.20-17,192.20 మధ్య కదలాడి చివరకు 103.50 పాయింట్లు నష్టపోయి 17,221.40 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో షేర్లు లాభాల్లో ముగిసాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, టైటన్‌, టాటా స్టీల్‌ నష్టాల్లో ముగిసాయి.