దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 169 పాయింట్ల నష్టంతో 57,947 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 17,271 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఆటో కంపెనీ, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, టాటా స్టీల్, మారుతీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలబాట పట్టాయి.