తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే! మంగళవారం ఉదయం 8 గంటలకే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటలవరకు తుది ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను మహిళా శక్తి సమైఖ్య భవనంలో నిర్వహించారు. నల్గొండతో పాటు.. ఖమ్మం స్థానాలను అధికార పార్టీ టీఆర్ఎస్ దక్కించుకుంది. నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన కోటిరెడ్డి.. 691 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ లోని రెండు స్థానాలను పూర్తిగా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.