భారత్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 16.65 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 2,71,202 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 314 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 15.50 లక్షలు దాటాయి. గత 24 గంటల వ్యవధిలో 1.38 లక్షలకుపైగా రోగులు కరోనా నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 94.51 శాతానికి తగ్గింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7743కు చేరుకుంది.