ప్రస్తుతం భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తు్న్నాయి. అయినప్పటికి కరోనా కేసులు తగ్గకపోవడంతో పాఠశాలలు, కాలేజ్‌లు మూసివేస్తున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతో జనవరి 31వరకు స్కూల్స్ , కాలేజ్‌లు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు అన్నింటిని బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.