హైదరాబాద్‌లోని ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- దూరవిద్య విధానంలో ఎంఏ ఇంగ్లీష్‌ ప్రోగ్రామ్‌ లో ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో పూర్తిచేయవచ్చు. కాంటాక్ట్‌ తరగతుల ద్వారా బోధన ఉంటుంది. ప్రింట్‌, ఆడియో, వీడియో, ఆన్‌లైన్‌ రిఫరెన్స్‌ మెటీరియల్‌ అందిస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసైన్‌మెంట్‌లు పూర్తిచేసి మొదటి ఏడాది పరీక్షలు పాసైతేనే రెండో ఏడాది ప్రవేశానికి అనుమతిస్తారు. మరియు అసైన్‌మెంట్‌లకు 25 శాతం, ఫైనల్‌ ఎగ్జామ్‌కు 75 శాతం వెయిటేజీ ఉంటుంది.