మనలో చాలామంది చిన్న చిన్న పనులు చేసినా అలసట, నిస్సత్తువ రావడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవటం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి నుండి ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే పాటించే చిట్కా ఒకటి ఉంది. అదేంటంటే.. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి రెండు వాల్నట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 5 కిస్ మిస్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఐదు నిమిషాలపాటు మరిగాక పటిక బెల్లం ముక్కలు వెయ్యాలి. ఈ పాలను గ్లాసులో పోసుకుని తాగాలి.

ఈ పాలను తాగితే తక్షణ శక్తి లభించడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. పిల్లలు ఈ పాలను తాగితే మెదడు పనితీరు మెరుగు పరచి పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. పిల్లలు చదువు పట్ల శ్రద్ధ చూపుతారు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఈ పాలను వారంలో 2 సార్లు తాగితే నరాలలో బలహీనత తగ్గుతుంది. నీరసం,నిసత్తువ, అలసట తగ్గి రోజంతా హుషారుగా ఉంటారు. వాల్ నట్స్ కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. వాల్ నట్స్, కిస్ మిస్ అందుబాటులోనే ఉంటాయి.