టోంగా దీవిలో శుక్రవారం అగ్నిపర్వతం విస్పోటనం జరగడంతో బూడిద బయటకు వచ్చింది. వాయువులు 20 కిలోమీటర్ల మేర వ్యాపించింది. అలల మాదిరిగా అగ్నిపర్వతం బద్దలు కాగా.. నలుపురంగులో స్పష్టంగా కనిపించింది. అగ్నిపర్వతం గత నెల 20వ తేదీ నుంచి యాక్టివ్‌గా ఉండి, జనవరి 11వ తేదీ నుంచి క్రమంగా కదిలి, శుక్రవారం 14వ తేదీ విస్పోటనం చెందింది.

విస్పోటనం కలుగడంతో టోంగాలో సునామీ హెచ్చరికలు జారీచేశారు. హుంగా, టోంగా, హుంగాలో ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇప్పుడు టోంగాలో పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని జర్నలిస్టు మేరీ ఫంగువా తెలిపారు. అగ్నిపర్వతం పలు సందర్భాల్లో బద్దలైందని, తర్వాత సునామీ హెచ్చరికలు జారీచేశామని తెలిపారు.

అలలు భారీగా ఎగిసిపడటంతో మూడు అలలతో రోడ్డు మీద నుంచి తోటలోకి వచ్చిందని, దీంతో సురక్షిత ప్రాంతానికి వెళుతున్నామని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. అలలు రావడానికి ముందు కొన్ని కార్లు రావడాన్ని చూశామని చెప్పారు. అగ్నిపర్వతం బద్దలు కావడం భయంకరంగా ఉందని, పోలీసులు వచ్చి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని వెల్లడించారు.