వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కేసు లో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం
విజయవాడ నగర పోలీస్ కమిషనరేటులోని భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదయిన క్రైమ్.నం.291/2015 సెక్షన్ 376 (2 ) (ఐ),450 ఐ.పి.సి కేసు లో నిందితుడైన విజయవాడ భవానీపురం కి చెందిన తలకొప్పుల రాజు అలియాస్ బాగిరాజు (46 ) పై నేరం రుజువైనందున ది.16 .02 . 21 వ తేదీన మహిళా సెషన్స్ జుడ్గే శ్రీమతి జి.ప్రతిభాదేవి గారు నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ.500 / ల జరిమానా విధిస్తు తీర్పునివ్వడం జరిగింది.
ఈ కేసులో నిందితుడు లారీ డ్రైవర్ గా పని చేస్తాడు.ఇతనికి విజయవాడ, భవానీపురంకు చెందిన 45 సం||ల వయసు ఉన్న బాధితురాలి భర్త తో పరిచయం ఉంది.ఆ పరిచయం తో తరచూ అతని కోసం బాధితురాలి ఇంటికి వెళుతూ, ఇంట్లో విషయాలను గమనించాడు.బాధితురాలికి మాటలు రాకపోవడం తో పాటు వినపడదు .ఇది అదనుగా భావించిన ముద్దాయి బాధితురాలిపై అత్యాచారం చేయాలనీ నిర్ణయించుకుని, ది.18 .06 .2015 వ తేదీన సాయంత్రం 6 .30 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయం లో ఇంట్లోకి ప్రవేశించి,బాధితురాలిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడి పారిపోవడం జరిగింది.ముద్దాయి పారిపోయే సమయంలో ఇంటి చుట్టూ పక్కల వారు గమనించి బాధితురాలిని ఏమి జరిగిందని అడగగా తనపై అత్యాచారం గురించి వెల్లడించింది.
ఈ కేసుకు సంబంధించి బాధితురాలి కుమారుడు ది.18 . 06 .2015 వ తేదీన ఇచ్చిన
ఫిర్యాదు పై భవానీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, దర్యాప్తు లో భాగం గా నిందితుడు తలనొప్పుల రాజు అలియాస్ బాజీరాజ్ ది.19 .06 .2015 వ తేదీన భవానీపురం ఇన్స్పెక్టర్ శ్రీ కే.గోపాల కృష్ణ గారు అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ కేసు లో ప్రాసిక్యూషన్ తరపున ఏ.పి.పి శ్రీ జి.దైవ ప్రసాద్ గారు, సి.ఎం.ఎస్. పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో 14 మంది సాక్షులను విచారించడం జరిగింది.