మంగళవారం ఉదయం 8 : 30 గంటల సమయం లో సిధి జిల్లాకు చెందిన పాట్నా గ్రామం లో బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్ళగా 40 మంది నీట మునిగి మృతి చెందారు.వీరిలో 21 మంది పురుషులు కాగా 18 మంది మహిళలు , ఒక చిన్నారి ఉన్నారు.
బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడం వల్ల కొంత మంది గల్లంతు అయ్యారు.మొత్తం బస్సు లో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారవర్గాల సమాచారం.వారిలో ఇప్పటికి ఏడుగురిని సురక్షితం గా ఒడ్డుకు చేర్చమని రెవ డివిషనల్ కంమిషనేర్ రాజేష్ జైన్ వెల్లడించారు.గల్లంతు అయినవారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పారు.వాహనం మీద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు మధ్య ప్రదేశ్ సి ఎం శివరాజ్ సింగ్ చౌహన్ రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు.బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ వీడియో సందేశాన్ని ట్వీట్ చేసారు.ఈ ఘటన లో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.