విశాఖ ఉక్కు మనవారి హక్కు.ఆనాటి పోరాటం తో స్వయం గా ఇందిరా గాంధీ దిగి వచ్చి మరీ అన్నిటికంటే విశాఖ యే అనువైన స్థలం గా గుర్తించారని చంద్రబాబు గుర్తు చేసారు.

5,00,000 మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ ఉక్కు అని, 32 మంది ప్రాణ త్యాగ ఫలితమే విశాఖ ఉక్కు అని , స్టీల్ ప్లాంట్ లేకపోతె విశాఖ లేదని చంద్ర బాబు వ్యాఖ్యానించారు.
విశాఖ లో తప్ప మరెక్కడా పోర్ట్ బేస్గా ప్లాంట్ లేదని ఈ సందర్భం గా గుర్తు చేసారు.ఆనాడు రైతులు ఇచ్చిన భూమి విలువ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు.విశాఖ ప్రజలు నీతి నిజాయితీ తో ఉంటారని, శాంతిని కోరుకుంటారని చెప్పారు.కాలక్రమేణా అన్ని ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో విశాఖ కూడా ఒకటి అని రాష్ట్రానికి విశాఖ ఎప్పటికి ఆర్ధికరాజధాని గానే ఉంటుంది అని చెప్పారు.